Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, who recently took charge as Commissioner of Police, Hyderabad City, was greeted by Sri M. Ramesh, IPS, Commissioner of Police, Cyberabad, and Smt. B. Sumathi, IPS, Commissioner of Police, Malkajgiri, who presented him with bouquets and extended their wishes.
Dr. Bhagwat called for close coordination among the three Commissionerates to strengthen the city’s safety and security, and said citizens should not face jurisdictional hurdles when seeking police help. He added that collective effort would help bring greater credit to the Telangana Police and the Government.
Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, who recently assumed office as Commissioner of Police, Hyderabad City, called on Sri Sanjay Jaju, IAS, Chief Secretary to the Government of Telangana. He presented the Chief Secretary with a bouquet during the courtesy meeting.
Following his assumption of charge as the new Commissioner of Police, Hyderabad City, Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, paid a courtesy call on the Chief Secretary to the Government of Telangana, Sri Sanjay Jaju, IAS, today and presented him with a bouquet.
Following his assumption of charge as the new Commissioner of Police, Hyderabad City, Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, was called on today by the Commissioner of Police, Cyberabad, Sri M. Ramesh, IPS, and the Commissioner of Police, Malkajgiri, Smt. B. Sumathi, IPS, who paid a courtesy visit, presented him with bouquets, and extended their warm wishes.
Speaking on the occasion, Hyderabad City Police Commissioner Sri Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, emphasized the need for all three Police Commissionerate's to work together in close coordination to ensure city safety and security in the coming days. Citizen should not face any jurisdiction issues whenever they approach police for help. He further stated that through collective effort and dedication, they will strive to bring greater laurels and a good reputation to the Telangana Police and Government.
The Commissioner’s Task Force, working with local police, conducted raids on four waraq units around Charminar and registered four cases. The units and their owners were M/s. Ittehad Waraq Shop (Mohammed Akber, under PS Charminar), M/s. UTC Silver Leafs (Mohammed Wali Uddin, under PS Hussainialam), M/s. M.A. Metro Waraq Shop (Mohammed Shareef, under PS Mogalpura) and M/s. Tara Unit in Bibikachasma (Mohammed Jaleel Khan, under PS Falaknuma).
The police confiscated 49 bundles of counterfeit aluminium silver leaves, more than 10 kg of aluminium flakes, silver-coated sugar balls that were not genuine, Qiwam, tobacco, paan chutneys, animal skin sheets and manufacturing equipment.
The accused had no FSSAI licence. They sold aluminium products as real silver to sweet shops, bakeries and paan shops throughout Telangana, buying the flakes from Uttar Pradesh, with demand peaking around festivals.
These practices breach food safety regulations, which mandate that edible silver leaf be 99.9% pure and contain no material of animal origin. Long-term exposure to aluminium can also damage the kidneys, nerves and bones.
Sri Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, today (13.11.2026) assumed charge as the Commissioner of Police, Hyderabad City @CPHydCity, at TGICCC, Banjara Hills.
His key priorities include strong Law & Order, women’s safety, cybercrime prevention, traffic management and citizen-centric policing, with Zero Tolerance towards Corruption.
He also held discussions with senior officers to strengthen policing and address key challenges across the city.
#cphyderabad#hyderabadcitypolice
బాధ్యతగల హోదాలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి రాంగ్ రూట్.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని జీవిత ప్రయాణాన్ని నడిరోడ్డుపై శాశ్వతంగా ముగించేసింది!
ఉస్మానియా వర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ.. రేపటి రోజున ఇంజినీర్‌గా దేశానికి సేవలందించాలని ఎన్నో కలలు కన్న ఆయేషా ముస్ఫిరా ఆశలన్నీ, ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్ వల్ల క్షణాల వ్యవధిలోనే రాలిపోయాయి.
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
కుమార్తెను కాలేజీకి తీసుకెళ్తున్న ఆ తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే కళ్లముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కూతురు విగతజీవిగా రోడ్డుపై పడివుండటం చూసి, నిస్సహాయంగా ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఎవరింటి దీపాన్నో ఆర్పేస్తోంది. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరం!
గుర్తుంచుకోండి.. మీరు తీసుకునే రాంగ్ రూట్.. మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదు!
ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించండి.. అమాయకుల ప్రాణాలను బలితీసుకోకండి.
@SBIChairman@TheOfficialSBI#roadsafety#stopwrongroutedriving#trafficdiscipline#hyderabadpolice
లక్డీకాపూల్‌లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా, @CommissionrGHMC గారితో కలిసి స్వయంగా బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించాను.
లక్డీకాపూల్ పరిసరాల్లో ప్రతిపాదిత వన్ వే నూతన విధానాన్ని నవంబర్ 22న (ఆదివారం) ప్రయోగాత్మకంగా ఒక్క రోజు ట్రయల్ రన్ అమలు చేయనున్నాం.
కూడళ్ల వద్ద నిరీక్షణ సమయం తగ్గించి, ఇంధనం ఆదా చేయడమే లక్ష్యంగా... స్థానికుల సలహాలు, సాంకేతిక నిపుణుల డేటా ఆధారంగానే దీని కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకుంటాం.
నగరవాసులకు మరింత సురక్షితమైన, సాఫీ ప్రయాణాన్ని అందించేందుకు చేపడుతున్న ఈ ట్రయల్ రన్‌కు ప్రజలంతా సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
#hyderabadtraffic#lakdikapool#trafficupdate#hyderabadcitypolice
Increasingly complex Cyber Security incidents are being frequently reported.
Entities handling citizen finances and data—including Banks, Financial Institutions, Quick Commerce, and Mobility Platforms—are requested to strengthen their cybersecurity systems, processes, and manpower against evolving AI-assisted attacks and hacker syndicates.
All third-party systems, services, and modules handling confidential data must be treated on par with core applications, with stringent quality norms implemented across the ecosystem.
This is crucial for the safety of citizens' finances and overall well-being.
#cybersecurity#hyderabadpolice#cybersafety#dataprivacy#cybercrimealert
An advisory issued by I4C warns about AI-assisted cyber attacks targeting Banks, NBFCs and FinTech platforms through unpatched software and poorly secured systems.
Such attacks can lead to unauthorised transactions, customer data theft and misuse of mule accounts to transfer stolen funds.
Financial institutions are advised to strengthen security systems, monitor suspicious transactions, verify beneficiaries and report cyber incidents within the prescribed timelines.
📄 Read the complete advisory: i4c.mha.gov.in/theme/resourc…#cyberdost#cyberadvisory#aicyberattacks#financialfraud#cybersecurity#bankingsecurity@mygovindia@MyGovHindi@_DigitalIndia
'దీపావళి కానుక' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల.. ప్రజలారా అప్రమత్తం!
‘పేటీఎం దీపావళి కానుకగా అందరికీ రూ.1,000 నగదు ఇస్తోంది.. వెంటనే క్లెయిమ్ చేసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సందేశం పచ్చి మోసం.
‘నేను ఫేక్ అనుకున్నా.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి.. మీరు ట్రై చేయండి’ అంటూ నమ్మించే రీతిలో కేటుగాళ్లు పన్నిన ఉచ్చు ఇది.
పండుగ పూట ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ ముఠాలు కాటేసేందుకు సిద్ధమయ్యాయి.
ఇలాంటి సందేశాలతో పాటు వచ్చే అనుమానాస్పద లింకులను (`akcxy.buzz` వంటి నకిలీ వెబ్సైట్లు) పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు.
ఈ లింకుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించడమే కాకుండా.. మీ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
ఏ ప్రముఖ సంస్థ కూడా అపరిచిత లింకుల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ చేయదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
➡️ గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయకండి.
➡️ నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి ఇతర వాట్సాప్ గ్రూపులకు, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేసి ఇతరులనూ ముప్పులోకి నెట్టకండి.
➡️ ఎలాంటి సందర్భంలోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు.
➡️ ఒకవేళ మోసపోతే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ **1930** కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in) వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయండి.
#cybersecurity#cyberalert#fakelinkscam#hyderabadpolice#safefestivities#staysafeonline
ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేసి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చేసేందుకు ఇవాళ లక్డీకాపూల్ పరిసరాల్లో బైక్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించాను.
ద్వారకా హోటల్, పాత సైఫాబాద్ పీఎస్, హెచ్డీఎఫ్సీ, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ జంక్షన్లలో రోడ్ల స్థితిగతులు, రద్దీ తీవ్రతను పరిశీలించాం.
ఆయా కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తగా వన్-వే విధానం అమలుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించాం.
ఈ విధానంపై త్వరలోనే జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటాం. వాహనదారులకు ఇబ్బంది లేకుండా తొలుత దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సరళీకరణకు వన్-వేలను పరిశీలిస్తున్నాం.
ట్రాఫిక్ నిపుణులతో నిరంతరం చర్చిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు నగరవాసులు సహకరించాలని కోరుతున్నాను.
పోక్సో, మహిళలపై అఘాయిత్యాల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు.. పోలీసు-వైద్యుల మధ్య మెరుగైన సమన్వయమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులతో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాం.
న్యాయస్థానాల్లో నేర నిరూపణకు శాస్త్రీయ ఆధారాలే అత్యంత కీలకమైనందున.. నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా సకాలంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు వీలుగా, బాధితుల వైద్య పరీక్షల నివేదికలను వేగంగా అందించాలని సూచించాం.
వైద్యులు ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు లేకుండా నిశ్చింతగా విధులు నిర్వర్తించేలా హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున ప్రత్యేక లైజన్ వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చాం.
నేరం జరిగినప్పుడు చట్టం ఎంత వేగంగా స్పందిస్తే బాధితులకు అంత భరోసా.. నేరస్థుల్లో అంత భయం కలుగుతాయి.
రక్తమిచ్చి ప్రాణం నిలుపుదాం.. అమరుల త్యాగానికి సెల్యూట్ చేద్దాం!
సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమర జవాన్ల నిస్వార్థ త్యాగాలకు నిజమైన నివాళిగా.. హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న బృహత్తర మెగా రక్తదాన యజ్ఞం జరుగుతోంది.
కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో, 28 ప్రముఖ బ్లడ్ బ్యాంకుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో నగరవాసులంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి.
సైన్స్ ఎంత పురోగమించినా రక్తాన్ని ఫ్యాక్టరీల్లో తయారు చేయలేం; ఆపదలో కొట్టుమిట్టాడే నిండు ప్రాణాన్ని తోటి మనిషి ఇచ్చే దానమే నిలబెడుతుంది.
శాంతిభద్రతల కోసం పోలీసులు సర్వస్వాన్నీ ధారపోస్తుంటే.. ప్రమాద బాధితులు, తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు మనం రక్తాన్ని దానం చేయడమే అమరులకు అర్పించే అసలైన అంజలి.
రక్తదానం వల్ల ఎలాంటి నీరసం రాదు సరికదా, గుండె ఆరోగ్యం మరింత మెరుగవుతుంది.
రక్త కొరతతో ఏ ఒక్క ప్రాణమూ గాల్లో కలవకూడదంటే.. ప్రతి ఇంట్లో ఒకరు రక్తదాతగా తయారు కావాలి.
హైదరాబాద్ యువత, విద్యార్థులు, ఐటీ నిపుణులు, మహిళలు, కాలనీ సంఘాలు ఈ మహత్కార్యంలో స్వచ్ఛందంగా కదలివచ్చి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిస్తున్నాం.
రండి.. రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం!
#hyderabadpolice#megablooddonation#donatebloodsavelives#hyderabad
ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా... లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా?
నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించండి.
రైల్వే ట్రాక్ పక్కన బాహ్య ప్రపంచపు స్పృహే లేకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టిన ఈ హృదయ విదారక దృశ్యం ఎవరి గుండెలనైనా బరువెక్కించక మానదు. హైదరాబాద్ బొల్లారం సమీపంలో ఇటీవల జరిగిందీ ప్రమాదం.
క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన అజాగ్రత్త బతికుండగానే నిండు జీవితాన్ని ఎలా ముగింపునకు తెస్తుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు.
చెవుల్లో దూరిన ఆ పరికరాలు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేసి, సమీపిస్తున్న ప్రమాద ఘంటికలను సైతం వినిపించకుండా చేస్తున్నాయి.
భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా గ్రహించలేనంతగా పరధ్యానంలో మునిగిపోవడం తీవ్ర విషాదాలకు దారితీస్తోంది.
ఇది కేవలం రైల్వే ట్రాక్‌ల వద్దే కాదు, రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా నిత్యం ప్రాణాల మీదకు తెస్తున్న భయానక వాస్తవం.
బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల స్పృహ కోల్పోయి, వెనుక వచ్చే వాహనాల హారన్లు గానీ, అత్యవసర అంబులెన్స్ సైరన్లు గానీ వినబడక తమ ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారు.
నిజానికి ఈ సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు, అలాగే జీవితాన్ని మించిన వినోదమూ మరొకటి లేదు.
మీరు మాట్లాడుతున్న ఫోన్ కాల్‌ను కాసేపు ఆపవచ్చు, వింటున్న పాటను తర్వాతైనా వినవచ్చు, కానీ ఆ క్షణిక నిర్లక్ష్యానికి ఒక్కసారి ప్రాణం గాల్లో కలిసిపోతే ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు. ఆ తర్వాత మీ కుటుంబానికి మిగిలేది జీవితాంతం తీరని శోకం, అంతులేని వేదన మాత్రమే.
ముఖ్యంగా యువత ఈ భ్రమల నుంచి తక్షణమే బయటకు రావాలి. రోడ్లపై నడుస్తున్నప్పుడు అయినా, వాహనాలు నడుపుతున్నప్పుడు అయినా, రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్నప్పుడు అయినా ఇయర్ఫోన్లు వాడే ప్రాణాంతక అలవాటును తక్షణమే మానుకోవాలి.
రోడ్లు, రైల్వే ట్రాక్‌లు అనేవి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలు తప్ప అలసత్వానికి తావిచ్చే వేదికలు కావు.
కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి, నిండు ప్రాణాలను నిర్లక్ష్యానికి బలివ్వకండి, మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి.
Disclaimer: This video is shared strictly for public awareness and safety, not to cause distress.
#safetyfirst#roadsafety#railwaysafety#hyderabadcitypolice
జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ గారి హత్య-దోపిడీ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు.
రెండు నెలల పాటు నేపాల్, ఇతర రాష్ట్రాల్లో అలుపెరగక శ్రమించి, దారుణానికి ఒడిగట్టిన పనిమనిషితో సహా నలుగురు సభ్యుల అంతర్జాతీయ నేపాల్ ముఠాను సిట్, జూబ్లీహిల్స్ బృందాలు అరెస్ట్ చేశాయి.
ఇళ్లలో పనిమనుషులు లేదా వాచ్మెన్లను పెట్టుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లలో ఉచిత పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.
#hyderabadcitypolice#jubileehills#safehyderabad#publicadvisory
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ స్టేడియంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించాను.
సమాజ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి అసువులు బాసిన అమర పోలీసుల నిస్వార్థ సేవలు, సర్వోన్నత త్యాగాలు కలకాలం చిరస్మరణీయం.
ఆ అమరవీరుల త్యాగస్ఫూర్తిని గుండెల్లో నింపుకొని, మరింత నిబద్ధతతో ప్రజాసేవకు పునరంకితం కావడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి.
#policecommemorationday#policemartyrs#salutetomartyrs
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం పోలీస్ యూనిఫాం డ్యూటీ మాత్రమే కాదు... అది ప్రతి పౌరుడి బాధ్యత కావాలి!
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమంటే, సమాజంలో బాధ్యతాయుతమైన పౌర స్పృహను మేల్కొలపడమే. పౌరుల స్వీయ క్రమశిక్షణే సమాజానికి అసలైన రక్షా కవచం.
అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నేటి ఈనాడు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన నా ప్రత్యేక వ్యాసం ఇది. తప్పక చదవగలరు.
#policecommemorationday#policemartyrs#selfdiscipline#eenadu#hyderabadpolice