
సీతంపేటలో 2ఎన్డీఆర్ఎఫ్ మొత్తంగా 5 NDRF, 1 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

సీతంపేటలో 2ఎన్డీఆర్ఎఫ్ మొత్తంగా 5 NDRF, 1 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపు గంటకు 60-70 కి.మీ గరిష్టంగా 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే శ్రీకాకుళం, టెక్కలి, పలాస 3 ఎన్డీఆర్ఎఫ్, విజయనగరంలో 1 ఎస్డీఆర్ఎఫ్, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరు,

శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గురువారం (19-11-2026) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 09 కిమీ వేగంతో కదులుతుందని తెలిపారు. ఇది ప్రస్తుతానికి నరసాపురానికి 500 కిమీ, కళింగపట్నంకి 540కిమీ, చెన్నైకి 560 కిమీ, గోపాల్‌పూర్‌కి 630 కిమీ, పూరీకు 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, : 18-11-2026. దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

కేంద్రాలు నిరంతరం 24 గంటల పాటు పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సహాయం కోరే సమాచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని హోంమంత్రి సూచించారు.

11 రాష్ట్ర విపత్తు స్పందన దళాలతో పాటు స్థానిక అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక బృందాలను తక్షణమే రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నియంత్రణ

ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేశారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుపాను అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 13 జాతీయ విపత్తు స్పందన దళాలు,

అక్వాన్ తుపాను మందగమనంతో గంటకు కేవలం 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు హోంమంత్రికి వివరించారు. ఎల్లుండి మధ్యాహ్నానికి శ్రీకాకుళం- దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన

తుపాను ప్రభావం, ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆమె ఆదేశించారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి! - 48 గంటల పాటు యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉండాలి. - ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత ఆదేశం అమరావతి, నవంబర్ 18 : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు సిబ్బంది అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు.

తుపాను ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున, విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మూడు డిస్కంల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తుపాను తీవ్రత దృష్ట్యా విద్యుత్ స్తంభాలు,

*అమరావతి:* అక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

18-11-2026 *అక్వాన్ తుపానుపై విద్యుత్ శాఖ అప్రమత్తం* *నెల్లూరు నుంచి విశాఖ వరకు ప్రత్యేక నిఘా* *120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం* *ముందస్తు చర్యలకు మంత్రి గొట్టిపాటి ఆదేశం* *సిబ్బంది,సామాగ్రి కోసం తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రికి గొట్టిపాటి లేఖ*